History of Titanic ..అంతుచిక్కని రహస్యాలు, అసలు వాస్తవాలు ఏంటో తెలుసా..?

 టైటానిక్‌ శాపమా..? నేటికీ అంతుచిక్కని రహస్యాలు, అసలు వాస్తవాలు ఏంటో తెలుసా..?

ప్రపంచంలోనే అతి పెద్ద ఓడ టైటానిక్‌ ప్రమాదంలో మునిగిపోయి 111 ఏళ్లు పూర్తయ్యాయి. అయినప్పటికీ, దాని చుట్టూ ఉన్న రహస్యాలు, దాని ఫలితంగా జరిగిన సంఘటనలు మాత్రం ఆగటం లేదు.
ఇటీవల కూడా టైటానిక్‌ను చూసేందుకు వెళ్లిన ఐదుగురు కోటీశ్వరులు సముద్రంలో గల్లంతయ్యారు. 1912 ఏప్రిల్‌ 15న జరిగిన టైటానిక్‌ ప్రమాద సంఘటన తో ప్రపంచ ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా మారింది. ఇక ఇప్పుడు మరోమారు అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్‌లో నీటి అడుగున పర్యటనకు వెళ్లిన ఐదుగురు మిలియనీర్లు అదృశ్యమైన వార్తతో ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. వారి కోసం సముద్రంలో తీవ్ర అన్వేషణ కొనసాగుతోంది. అయితే, ఇప్పటికీ అనేక మంది ప్రాణాలు తీసుకున్నా టైటానిక్ విషాదం ఇంకా ఎందుకు వెంటాడుతోంది. 111 ఏళ్ల తర్వాత కూడా ఈ ఓడ గురించి ప్రజలు చెబుతున్న పారానార్మల్ కథలు ఏమిటి..? టైటానిక్ గురించి తెలియని అనేక వాస్తవాలు, రహస్యాలు ప్రచారంలో కొనసాగుతున్నాయి.
1912లో మంచుకొండను ఢీకొట్టి కూలిపోయిన టైటానిక్‌లో 2,200 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. వారిలో 1500 మంది చనిపోయారు. 700 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. కానీ రోజర్ బ్రిగేక్స్ అనే ఒక సంగీత కళాకారుడు మాత్రమే 2000 సంవత్సరం వరకు బ్రతికే ఉన్నారు. అతను టైటానిక్ షిప్ బ్యాండ్‌లో 20 ఏళ్ల సెలిస్ట్. టైటానిక్ విపత్తు తర్వాత అతని మృతదేహం లభించలేదు. ఫ్రెంచ్ సైన్యం అతన్ని ‘డెసర్టర్’గా ప్రకటించింది. అందువల్ల, అతను 2000 సంవత్సరం వరకు చనిపోయినట్లు ప్రకటించలేదు. ఫ్రెంచ్ టైటానిక్ అసోసియేషన్ చొరవతో అతను నవంబర్ 2, 2000న చనిపోయినట్లు ప్రకటించారుర. అయితే, అతను ప్రమాదంలో మరణించారా..? ప్రాణాలతో బయటపడ్డారా.? అనేది ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీగానే ఉండడం గమనార్హం.
టైటానిక్ చుట్టూ అనేక వివాదాలు ఉన్నాయి. ముఖ్యంగా ఓడ మునిగిపోయే చివరి నిమిషం వరకు ఈ బృందం బ్యాండ్‌ వాయిస్తూనే ఉందని, ఒకవైపు ఇది అక్కడి ప్రయాణికులను శాంతపరిచే ప్రయత్నమని చెప్పినప్పటికీ, రోమ్ కాలిపోతున్నప్పుడు నీరో ఫిడేలు వాయించినట్టుగానే ఉందంటూ చాలా మంది టైటానిక్‌ ఘటనను పోల్చి చెప్పుకుంటారు.

ఇలాంటి పెద్ద ఓడలలో దూరప్రాంతాల్లోని వస్తువులను గమనించడానికి బైనాక్యులర్ గదిని ఏర్పాటు చేస్తారు. అందుకోసం ఉద్యోగులు రొటేషన్ పద్ధతిలో పని చేస్తూనే ఉంటారు. కానీ చివరి నిమిషంలో సిబ్బంది మార్పు గందరగోళంలో, బైనాక్యులర్ గది కీ ఎక్కడో పడిపోవటం వల్లే ప్రమాదానికి ముందు హిమానీనదాలు కనిపించలేదని చెప్పారు. ఈ బైనాక్యులర్ల చుట్టూ అనేక వివాదాలు జరుగుతున్నాయి.
టైటానిక్ ప్రయాణంలోనే కాకుండా నిర్మాణ సమయంలో కూడా 8 మంది సిబ్బంది వివిధ కారణాలతో మరణించారని చరిత్ర చెబుతోంది. అలాగే, ఆనాటి టైటానిక్‌లోని చాలా మంది ప్రయాణికులు లక్షాధికారులు. వారిలో జాన్ జాకబ్ ఆస్టర్ కొత్తగా పెళ్లి చేసుకుని తన భార్యతో హనీమూన్‌లో ఉన్నాడు. అతను ధనవంతుడు మాత్రమే కాదు, అప్పట్లో ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ఒకరిగా ఉన్నారు. ఆ సమయంలో అతని నికర విలువ 150 మిలియన్ అమెరికన్ డాలర్లు. నేటి పరంగా దీని విలువ 4.5 బిలియన్ డాలర్లు. అతను కూడా ప్రమాదంలో మరణించాడు.

సంగీత విద్వాంసుల మాదిరిగానే, ఓడ మునిగిపోయే చివరి నిమిషం వరకు ఓడలో పనిచేసిన వారు కూడా కొందరు ఉన్నారు. ఓడలోని 25 మంది ఇంజనీర్లు లైట్లు ఆరిపోకుండా పంపులను నిరంతరం నడుపుతూ చివరి వరకు సిగ్నల్స్ పంపడంతో వారు ఓడతో పాటు మునిగిపోయారు. 25 మందిలో ఒక్కరు కూడా బతకకపోవడం పెను విషాదం. అప్పటి పత్రికా నివేదికల ప్రకారం, సౌతాంప్టన్ సమీపంలోని నార్తమ్ నుండి చాలా మంది ప్రజలు టైటానిక్‌లో సిబ్బందిగా పనిచేశారు. టైటానిక్ దుర్ఘటనలో దాదాపు 686 మంది సిబ్బంది మరణించారు. వీరిలో అత్యధికులు ఈ గ్రామానికి చెందినవారేనని సమాచారం. నార్తం గ్రామంలోని పాఠశాలలో 240 మంది విద్యార్థులలో 120 మంది ప్రమాదంలో తమ తండ్రులను కోల్పోయారు.

అయితే, క్రూయిజ్‌లలో సాధారణంగా హనీమూన్ జంటలు ఉంటారు. కానీ, వారు సముద్రంలో మునిగిపోతారని ఎవరూ ఊహించి ఉండరు. ఒక్క టైటానిక్‌లో 13 మంది హనీమూన్ జంటలు ఉన్నారని చెబుతున్నారు. టైటానిక్ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన వారిలో మిల్వినా డీన్ ఒకరు. అతను 2009 లో 97 సంవత్సరాల వయస్సులో మరణించాడు. టైటానిక్‌లో ప్రాణాలతో బయటపడిన చివరి వ్యక్తి ఇతడే. 
రేడియోను కనిపెట్టిన మార్కోని కూడా టైటానిక్‌లో ప్రయాణికుడని మనలో ఎంతమందికి తెలుసు..? కానీ, టైటానిక్‌లో ప్రయాణించేందుకు టిక్కెట్లు కొనుగోలు చేసిన వారిలో ఆయన ఒకరు. కానీ,అతను మరేదో కారణంగా అతను టైటానిక్‌ కంటే ముందు వెళ్లే ఓడ ఎక్కి వెళ్లిపోయాడు. దాంతో అప్పుడు ప్రాణాలతో బయటపడ్డాడు.

  
News by.....
                  Goura yakobu 

Post a Comment

Previous Post Next Post