. చేయని తప్పుకు 125 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న చెట్టు.. ఎక్కడో తెలుసా..?


 చేయని తప్పుకు 125 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న చెట్టు.. ఎక్కడో తెలుసా..?


కొన్ని కొన్ని సార్లు చేయని తప్పులకు శిక్షలు అనుభవిస్తారు. ఏళ్ల తరబడి బందీలుగా ఉంటారు. అయితే.. మనుషులకు, జంతువులకు మాత్రమే ఇలాంటివి జరుగుతాయని మనకు తెలుసు.
కానీ, ఇదే సమస్య ఓ చెట్టుకు కూడా వచ్చింది. చేయని తప్పుకు ఓ చెట్టు కొన్నేళ్ల నుంచి బందీగా ఉంది. అవును మీరు విన్నది నిజమే. గొలుసులతో కట్టేసి మరీ మర్రి చెట్టును బందీ చేశారు. అది కూడా పదేళ్ల.. ఇరవయ్యేళ్లు కాదు. ఏకంగా 125 ఏళ్లు బందీ చేశారు. 

ఇది జరిగింది ఎక్కడో కాదు.. పాకిస్థాన్‌లోని లాండి కోటల్ ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసెకుంది. అక్కడ ఉన్న ఓ మర్రిచెట్టుకు ఇప్పటికీ సంకెళ్లు వేసి 'ఐయామ్ అండర్ అరెస్టెడ్' అని బోర్డు పెట్టి ఉంటుంది. అసలు ఆ మర్రిచెట్టును ఎందుకు అరెస్టు చేశారంటే.. 1898లో అఖండ భారతం బ్రిటిష్ పరిపాలనలో ఉన్నప్పుడు జేమ్స్ స్క్విడ్ అనే బ్రిటిష్ ఆర్మీ అధికారి ఓ రోజు రాత్రి మద్యం మత్తులో ఉండగా ఆ చెట్టు తనవైపు దూసుకొస్తున్నట్లుగా అనిపించిందట. దీంతో ఆ మర్రిచెట్టును అరెస్టు చేయమని సార్జెంట్లను ఆదేశించాడు. అలా అరెస్టైన ఆ చెట్టు ఇప్పటికీ అలాగే ఉంది.


News by ......

                Goura yakobu 

Join my what's app group 

https://chat.whatsapp.com/Buu8WtJ1Mat21Fmx5PqHiU



Post a Comment

Previous Post Next Post