Father's Day: ఫాదర్స్ డే ఎందుకు జరుపుకుంటారు? అసలు దీని ప్రాముఖ్యత ఏంటి?

Goura yakobu.......


History of Father's day.........


Father's Day: ఫాదర్స్ డే ఎందుకు జరుపుకుంటారు? అసలు దీని ప్రాముఖ్యత ఏంటి?



 Father's Day: ఫాదర్స్ డే ఎందుకు జరుపుకుంటారు? అసలు దీని ప్రాముఖ్యత ఏంటి?

గాయమైతే కట్టు కట్టేది అమ్మ. అసలు గాయమే కాకుండా చూసుకునేవాడు నాన్న. బాధ్యతలు నెరవేరుస్తూ బిడ్డల సంక్షేమం, అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసే ఏకైక శ్రమజీవి నాన్న.
అమ్మ ఆత్మీయతకు వచ్చిన గుర్తింపు, నాన్న త్యాగానికి దక్కలేదు. అయినా నాన్న ఇవేమీ పట్టించుకోడు. అందుకే నాన్నంటే అందరికీ ఎంతో స్పెషల్. తండ్రులు చేసిన సేవలు, త్యాగాలకు గుర్తుగా ఏటా ఒక రోజున ఫాదర్స్ డే నిర్వహిస్తారు. భారత్‌లో ప్రతి సంవత్సరం జూన్ మూడో ఆదివారాన్ని 'ఫాదర్స్ డే'గా సెలబ్రేట్ చేస్తారు. మరి ఈ ఫాదర్స్ డే ఎలా వచ్చింది? దీని చరిత్ర ఏంటో తెలుసుకుందాం. 

ఓ యువతి డిమాండ్‌తో

20వ దశాబ్దంలో అమెరికాలో పుట్టిందీ ఫాదర్స్ డే. వాషింగ్టన్ స్పోకేన్‌లోని సొనోరా స్మార్ట్ డాడ్ అనే యువతికి ఈ ఘనత దక్కుతుంది. మదర్స్ డే జరుపుకుంటుండగా.. ఫాదర్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకోవద్దని సొనోరా డిమాండ్ చేశారు. కుటుంబం కోసం త్యాగాలు చేసి, తల్లిలేని లోటు తీరుస్తూ ఆరుగురు పిల్లల్ని సాకిన తండ్రి విలియం జాక్సన్ స్మార్ట్‌కి సముచిత గౌరవం కల్పించాలని భావించారు.
దీంతో ఒక రోజును కేటాయించి సెలబ్రేట్ చేయడం మొదలు పెట్టారు. కాలక్రమేణా 'ఫాదర్స్ డే'ని నిర్వహించడం ప్రారంభించారు. ఈ సంప్రదాయం 1910, జూన్ 19న మొదలైంది. 

ఉద్యోగాలు .. ">

అమెరికాలో నేషనల్ హాలిడే

స్పోకేన్‌లో మొదలైన ఫాదర్స్ డే వేడుకలు ఏటా నిర్వహించుకోవడం అమెరికాలో పరిపాటిగా మారింది. అయితే, 1972 వరకు ఈ వేడుకను ప్రభుత్వం అధికారికంగా గుర్తించలేదు. అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్ నిక్సన్ దీనిని అధికారికం చేశారు. జూన్ నెలలో వచ్చే మూడో ఆదివారాన్ని 'ఫాదర్స్ డే'గా జరుపుకోవాలంటూ ఆదేశాలిచ్చారు. ఈ రోజున జాతీయ సెలవును కూడా ప్రకటించారు. అప్పటినుంచి అమెరికాలో ఏటా ఫాదర్స్ డేని అధికారికంగా నిర్వహిస్తున్నారు. భారత్‌లోనూ ఇదే రోజున జరుపుతారు. ఈ సారి జూన్ 18న ఫాదర్స్ డే రానుంది. 
ఫాదర్స్ డే ఎందుకంత ముఖ్యం?

నాన్నని సంతోష పరచడానికి, తండ్రిపై ఉన్న ప్రేమను చూపించుకోవడానికి 'ఫాదర్స్ డే' సరైన వేడుక. ఈ రోజున నాన్నతో కలిసి ఆనందంగా గడుపుతూ, చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటే బంధాలు మరింత బలపడతాయి. అంతేగాక, కుటుంబాలే కలిసిపోయే అవకాశం ఉంటుంది. పైగా, పిల్లల జీవితాల్లో తండ్రుల పాత్ర ఎలాంటిదనే విషయాన్ని ఈ వేడుక ప్రతిబింబిస్తుంది. ఫాదర్స్ డే వేడుకలకే పరిమితం కాదు. నాన్న ప్రాముఖ్యత ఏంటో తెలియజేసే పండుగ. నాన్న అనుభవ పాఠాలను నేర్చుకునేందుకు చక్కని వేదిక. అందుకే, ఫాదర్స్ డే రోజున నాన్న చేసిన త్యాగాలను స్మరించుకుందాం. తండ్రిని ఆదర్శంగా తీసుకుని జీవితంలో గొప్పగా ముందుకు సాగుదాం.

Written by.......

               Goura yakobu

Post a Comment

Previous Post Next Post